Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మహారాష్ట్రలో ప్రతిరోజూ ఎనిమిది మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుని మృతి చెందుతున్నారని ఎన్‌సిపి నేత అజిత్ పవార్ ఆవే దన వ్యక్తం చేశారు. తక్షణమే షిండే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన శాసనసభా సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై పవార్ మాట్లాడారు. షిండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1,203 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ''మహారాష్ట్రలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతుంది. పండిన పంటకు మంచి ధర లభించడం లేదు. దాంతో రైతులు ఆవేదనతో పండించిన పంటను రోడ్డుపై పడేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తెగిపోతున్నాయి. ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. షిండే- ఫడ్నవీస్‌ల ప్రభుత్వం రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు' అని పవార్ శాసనసభా సమావేశాల్లో మాట్లాడారు. అలాగే ఈ సమా వేశాల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికను ఉటంకిస్తూ.. రెండు నెలల్లో మర ఠ్వాడా ప్రాంతంలో 62 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.