Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికన్ సొసైటీ ఫర్ మెక్రోబయాలజీ జర్నల్లో వెల్లడి..
న్యూయార్క్: ఎలుకల్లో కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ సిటీ ఎలుకలకు కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం కనుగొంది. న్యూయార్క్ నగరంలో మొత్తం 8 మిలియన్ల ఎలుకలు ఉన్నాయి. ఇవి ప్రజలతో కాంటాక్ట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. న్యూయార్క్ ఎలుకలు సార్స్ కోవ్-2 యొక్క ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు పాజిటివ్ గా పరీక్షించబడ్డాయి. మొత్తం 79 ఎలుకల్లో 16.5 శాతం ఎలుకలకు కరోనా సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలకు కరోనా సోకుతుందని నిరూపించిన తొలి ప్రయోగం ఇదే అని అన్నారు. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యొక్క ఓపెన్-యాక్సెస్ జర్నల్ ఎంబియోలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే, కోవిడ్ సోకిన ఎలుకలకు ఎలా కరోనా సోకింది..? ఇది మానవులకు ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్ ఎలుకల్లో కొత్త వేరియంట్ల పరిణామం చెందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని డాక్టర్ హెన్రీ వాన్ చెప్పారు. మానవులను ప్రభావితం చేసే మహమ్మారిలో జంతువుల ప్రముఖ పాత్రను పోషిస్తాయని ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని అధ్యయన వేత్తలు చెప్పారు.