Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే
న్యూఢిల్లీ : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పున్ణసమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే పునరుద్ఘాటించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగు ల కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నట్టు తమ దృష్టి కి వచ్చిందని ఆర్ఐఎన్ఎల్ మేనేజ్మెంట్ ప్లాంట్ లోని ఉద్యోగుల కార్మిక సంఘాలతో చర్చిస్తోందని తెలిపారు. 2021 జనవరి 27న ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ (సీసీఈఏ) వైజాగ్ స్టీల్‌ప్లాంట్ లోని వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు. ప్రయివేటీకరణతో వ్యూహాత్మక పెట్టుబడు లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు తెలి పారు. ఆర్ఐఎన్ఎల్కు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఎగ్జిక్యూటివ్స్‌కు పదోన్నతలను అమలు చేస్తే ఏటా సుమారు రూ.13 కోట్లు వ్యయం అవుతోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 4,930 పోస్టులు ఖాళీ
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 4,930 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.