Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం అభినందనీ యమని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. తెలుగు సాహిత్యానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డుతో అత్యంత గౌరవాన్ని అందించిన నాటు నాటు పాట రచయిత, గాయకులు, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు దక్కటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసి మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు పొందటం తెలుగు చిత్రపరిశ్రమకే కాదు, యావత్ భారతీయ చిత్ర రంగానికి కూడా గర్వకారణమని ఆయన అన్నారు. ఈ అవార్డుతో మరిన్ని విజయాలను తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమ సాధించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వాలు కూడా తగినంత సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ ఆస్కార్ ఉన్నత గౌరవం తెలుగు చిత్ర పరిశ్రమ బాధ్యతను పెంచిందని అన్నారు.