Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత కాలుష్య రాజధానిగా రెండో స్థానంలో ఢిల్లీ
- ప్రపంచంలో భారత్‌ది ఎనిమిదో స్థానం
- 'వరల్డ్ ఎయిర్ క్వాలిటీ' నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కాలుష్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని మొదలుకొని ఇతర మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత 50 కాలుష్య నగరాల్లో 39 నగరాలు భారత్ నుంచే ఉన్నాయి. అలాగే భారత్ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య దేశాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్నది. 2021లో ఈ సూచిలో భారత్ ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. స్విస్కి చెందిన సంస్థ ఐక్యూఎయిర్ 'వరల్డ్ ఎయిర్ క్వాలిటీ' నివేదిక పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల నుంచి 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల మానిటర్ల నుంచి ఈ సమాచారాన్ని సేకరించింది. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించిన పీఎం 2.5 స్థాయిపై ఆధారపడి ఈ నివేదికను రూపొందించింది. 7,300 కంటే ఎక్కువ నగరాలను కలిగి ఉన్న ఈ జాబితాలో భారత్‌లోని పలు నగరాలు కాలుష్యంలో ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
చాద్ రాజధాని ఫస్ట్.. ఢిల్లీకి రెండో స్థానం
ఢిల్లీ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఉన్నది. అయితే ఈ ఏడాది నివేదికలో గ్రేటర్ ఢిల్లీ, న్యూఢిల్లీల మధ్య తేడాను చూపించింది. అయితే రెండూ కూడా టాప్ 10లోనే ఉండటం గమనార్హం. న్యూఢిల్లీ 2వ స్థానంలో నిలవగా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా చాద్ రాజధాని ఎన్డ్జమెనా నిలిచింది. ఎన్డ్జమెనా జనాభా పది లక్షల కంటే తక్కువగా ఉండగా.. న్యూఢిల్లీ జనాభా 40 లక్షల మంది కంటే ఎక్కువగానే ఉండటం గమనించాల్సిన అంశం. 31 నగరాలు కాలుష్య స్థాయిలలో రెండెం కల శాతం క్షీణతను నమోదు చేశాయి. వీటిలో పది యూపీలో ఉండగా, ఏడు హర్యానాలో ఉన్నాయి.
జాబితాలో మెట్రో నగరాలు..
హైదరాబాద్ ర్యాంకు199
దేశంలోని ఆరు మెట్రో నగరాలో ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉండగా.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా 99వ ర్యాంకులో ఉన్నది.
ఈ మెట్రో నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భద్రతా ప్రమాణాలతో పోల్చి చూస్తే తమిళనాడు రాజధాని చెన్నై తక్కువ కాలుష్యాన్ని కలిగి ఉన్నది. ముంబయి (137), హైదరాబాద్ (199), బెంగళూరు (440), చెన్నై (682) ల స్థానాలు వంద మీదనే నమోదు కావడం గమనార్హం.