Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ సభలు వాయిదా
- ఆస్కార్ విజేతలకు అభినందనలు
న్యూఢిల్లీ :పార్లమెంట్లో రెండో రోజు మంగళవారం కూ డా అదే సీను కొనసాగింది. ఉభ య సభలు ప్రారంభమైన కాసే పటికే వాయిదా పడ్డాయి. లోక్ సభ ప్రారంభం కాగానే.. రాహు ల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తూ తమ స్థానాల్లో నిల్చోని నినాదాలు హౌరెత్తించారు. అయితే ప్రతిపక్ష ఎంపీ లు ప్రధాని మోడీ గతంలో ఇతర దేశాల్లో చేసిన వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డు లను చేబూని నినాదాలు మారుమోగాయి. దీంతో సభలో తీవ్రమైన గందర గోళం నెలకొంది. వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలోనూ పరిస్థితి మారలేదు. దాంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో ఆస్కార్ విజేతలకు అభినందనలు
ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' సాంగ్‌కు, ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డులు రావడంపై రాజ్యసభ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్కార్ విజేతలకు అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. రాజ్యసభ ప్రారంభం కాగానే ఆస్కార్ గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ అన్ని పార్టీల నేతలు మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం, ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ బృందంపై ప్రశంసలు కురిపించారు. అనంతరం సభలో కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ రాహుల్ గాంధీ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ ఎంపీలు తమ స్థానాల్లో లేచి నినాదాలు చేశారు. దీనికి కౌంటర్‌గా ప్రతిపక్ష ఎంపీలు కూడా లేచి నినాదాలు చేశారు. పీయూశ్ గోయల్‌పై కాంగ్రెస్ ఎంపీ శక్తిసింహ గోహిల్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. లోక్‌సభ సభ్యుని గురించి సత్యదూరమైన విషయాలను రాజ్యసభలో ప్రస్తావించడం సభా హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కించపరిచే వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతకు ముందు పార్లమెంట్ గేటు నెంబర్ 1 వద్ద కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్ ఎంపీలు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు.