Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5300కోట్ల విలువజేసే డ్రగ్స్ పట్టివేత
- 102మంది అరెస్టు : రాష్ట్ర ప్రభుత్వం
గాంధీనగర్: గత ఏడాదిన్నర కాలం లో రూ.5300 కోట్ల విలువజేసే డ్రగ్స్‌ను గుజరాత్ పోలీసులు సీజ్ చేశారని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో 102మందిని అరెస్టు చేసినట్టు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చ సందర్భంగా ఈ సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం, ఆగస్టు 2021 నుండి ఫిబ్రవరి 2023 వరకు దాదాపు రూ.5300 కోట్ల విలువజేసే వెయ్యి కిలోల డ్రగ్స్‌ను గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో 56మంది విదేశీయులతో సహా 102మంది నిందితులను పట్టుకున్నారు. సముద్ర మార్గం గూండా హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు దేశంలోకి డంప్ అవుతున్నాయనే అంశాన్ని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ చావ్దా, అర్జున్ మోదావాడియా, ప్రవీణ్‌కుమార్, ఉదరు కంగద్ సభలో లేవనెత్తారు.
ముంద్రా పోర్ట్ వేదికగా మార్చినవారిపై విచారణ జరపండి : కాంగ్రెస్
అదానీ గ్రూప్ నిర్వహించే ముంద్రా పోర్ట్ నుంచి గతంలో మాదక ద్రవ్యాలు పెద్దమొత్తంలో పట్టుబడ్డాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ముంద్రా పోర్ట్‌ను వేదికగా మార్చిన వారి పాత్రపై బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే చావ్డా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మోదా వాడియా నార్కోటిక్స్ బ్యూరో సమాచారాన్ని ప్రస్తావిస్తూ.. 10శాతం డ్రగ్స్ మాత్రమే పట్టుబడుతోందని, 90శాతం దేశంలోకి ప్రవేశిస్తోందన్నారు. సరైన నిఘా నెట్వర్క్ లేకపో వటంతో గుజరాత్ పోలీస్ డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్ట లేకపోతున్నదని మోదా వాడియా విమర్శించారు.