Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వం... గవర్నర్ పై పిటిషన్ 20న విచారణ
న్యూఢిల్లీ : బిల్లులు ఆమోదించాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను ఆదేశించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. శాసనసభ ఆమోదించిన పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం ప్రస్తావించారు. ధర్మాసనం ఎదుట ఇప్పటికే కేసులు విచారణకు ఉన్నందున వచ్చే వారంలో విచారణకు తీసుకుంటానని సీజేఐ బదులిచ్చారు. పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున సోమవారం విచారణకు తీసుకోవాలని దవే అభ్యర్థించారు. దవే విజ్ఞప్తికి సీజేఐ సానుకూలంగా స్పందించి వచ్చే సోమవారం విచారణ చేపడతామన్నారు.