Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు
న్యూఢిల్లీ :మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని 13 పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నాడిక్కడ లిమెరిడియన్ హౌటల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశం, సమాజం ,సమగ్రాభివృద్ధి నిర్ణయం తీసుకోవడంలో మహిళలకు ప్రధాన భూమిక పోషించాల న్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయనీ, ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న సందేశం ఈ వేదిక ద్వారా స్పష్టమవుతోందని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో మహిళ భాగస్వామ్యంతోనే సాధికారిత సాధ్యం :జాన్ బ్రిట్టాస్, సీపీఐ(ఎం)ఎంపీ
తాను ఎంపీ కాకముందు జర్నలిస్టుననీ, పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాను జర్నలిస్టునని సీపీఐ(ఎం)ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లుకు చాలా పార్టీల వైఖరి వ్యతిరేకంగా ఉన్నదని తెలిపారు. రిజర్వేషన్ అంటే ఏదో పాలనలో బాధ్యలు ఇవ్వడం కాదనీ, దేశ ప్రజల్లో సగం మంది ఉన్న మహిళలకు భాగస్వామ్యం కల్పించడమని స్పష్టం చేశారు. పురుషులు కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు వేస్తున్నారనీ, వారికి రాజకీయాల్లో సముచిత స్థానం లభించాలని అన్నారు. దశాబ్దాలుగా మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఎదురు చూస్తున్నామనీ, ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మహిళ భాగస్వామ్యంతోనే నారీశక్తి, మహిళా సాధికారిత సాధ్యం అవుతాయని స్పష్టం చేశారు. దేశంలో అనేక వర్గాలు రాజకీయాల నుంచి బయటకు వెళ్లిపోయాయనీ, ఇది దురదృష్టకరమని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో మైనార్టీలు, మహిళలు ప్రాతినిధ్యం ఎంత? అని ప్రశ్నిం చారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యా నికి ఒక అర్థం ఉంటుందని అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తోందనీ, బిల్లును తెచ్చి ఆమోదించాలని డిమాండ్ చేస్తుందని తెలిపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు బిల్లు ఎందుకు ఆమోదం పొందటం లేదని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ అన్నారు. అన్ని పక్షాలు చేయాలని అనుకుంటే బిల్లు ఆమోదం కష్టమేమీ కాదని స్పష్టం చేశారు.
మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదు?్ణ ప్రియాంక చతుర్వేది, శివసేన
ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదనిశివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలని సూచించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తున్నాని ప్రకటించారు. అయితే, రిజర్వేషన్లో రిజర్వేషన్ కోటా ఉండాలని ప్రతిపాదించారు. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
వ్యూహాత్మక నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్య్ణం సుమతి, డీఎంకే ఎంపీ
వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరమని డీఎంకే ఎంపీ తమిళ్ సై తంగపంద్యాన్ (సుమతి) మాట్లాడుతూ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి చేసే ఈ పోరాటంలో తాము కలిసి నడుస్తామని అన్నారు. సీపీఐ ఎంపీ బినరు బిశ్వం మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయని విమర్శించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులు ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. ఈ ఉద్యమంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు. జేఎంఎం ఎంపీ మౌహ మాఝి మాట్లాడుతూ ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహౌత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉండడం మంచిగా అనిపించడం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందే, ఈ పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.
ప్రజలకు మంచి బిల్లులను తీసుకురావాల్ణి రాఘవ చద్దా, ఆప్ ఎంపీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల కోసం కవిత లేవనెత్తిన డిమాండ్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నదనీ, దాన్ని సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావడానికి ఉపయోగించాలని సూచించారు. సమాజ వాది పార్టీ ఎంపీ ఎస్టీ హాసన్ మాట్లాడుతూ మహిళలకు తగిన వాటా కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. వీసీకే ఎంపీ తిరుమావలవన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరమని తెలిపారు. ఆలస్యం చేస్తే దేశానికి , ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం నేత ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రైతు నేతలు గుర్నామ్ సింగ్ ఛదౌని, రాజేవాలా, బీఆర్ఎస్ ఎంపీలు మాలోతు కవిత, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.