Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముర్ము
తిరువనంతపురం : ప్రసుత్తం కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం రాత్రి పినరయి విజయన్ ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ ఏడాది రిపబ్లిడే వేడుకల్లో 'నారీ శక్తి' పేరుతో కేరళ ప్రభుత్వం రూపొందించిన శకటం చూసి తాను చాలా ఆనంద పడ్డానని తెలిపారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే 'ఉన్నతి' పథకాన్ని ముర్ము ప్రారంభించారు. కేరళలో మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన కార్యక్రమం కుటుంబశ్రీ చరిత్రను వివరించే పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎం విజయన్, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.