Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొట్టివేయాలని కోర్టు ఆదేశం
బీహార్ : బెయిల్ కోసం నాలుగేళ్ల బాలుడు కోర్టును ఆశ్రయించిన ఘటన బీహార్లోని బెగుసరారు జిల్లాలో చోటుచేసుకుంది. 2021 ఏప్రిల్లో రెండేళ్ల వయసున్న బాలుడు సహా 8 మంది కంటైన్మెంట్ ప్రాంతంలో పెట్టిన బారికేడ్లు తొలగించడం ద్వారా కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలుడి తల్లికి ఈ కేసు విషయం గురువారమే తెలిసింది. దీంతో బెయిల్ కోసం తన కుమారుణ్ని వెంటబెట్టుకుని కోర్టుకు రాగా, బెగుసరారు కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చిన్నారిపై ఇలాంటి కేసు పెట్టడానికి, బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి నిబంధనలు లేవని తెలిపింది. బాలుడిపై కేసు కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది.