Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ముందు విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరుకాలేదు. మనీల్యాండరింగ్ వ్యవహారంలో 18న విచారణకు హాజరుకావాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈనెల 16న ఈడీ నోటీసులు ఇచ్చింది. శనివారం ఈడీ ముందుకు రావాల్సి ఉండగా ఎంపీ మాగుంట విచారణకు దూరంగా ఉన్నారు. ఆయన అన్న కుమారుడికి అరోగ్యం బాగోలేకపోవడంతో చెన్నై వెళ్లినట్టు తెలిసింది. ఈ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు ఈడీ అధికారులకు మాగుంట సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మరో రోజు విచారణకు వస్తానని అందులో పేర్కొనట్టు సమాచారం. అయితే మాగుంట విజ్ఞప్తిపై ఈడీ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు.
మాగుంట రాఘవకు ఈనెల 28 వరకు కస్టడీ పొడగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి జ్యూడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 28 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణంలో మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఫిబ్ర వరి 10న రాఘవ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు, అనంతరం అదుపు లోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 11న రాఘవ రెడ్డిని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా, 10 రోజులు కస్టడీ విధించింది. ఈ గడువు ముగియడంతో అదే నెల 20న కోర్టులో హాజరు పరుచగా14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.