Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : భూ అక్రమణ ఆరోపణలపై నోబుల్ సాహిత్య అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు విశ్వ భారతి యూనివర్శిటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆక్రమించుకున్న భూమి నుంచి ఎందుకు తొలగించకూడదో సమాధానం ఇవ్వాలని అమర్త్యసేన్‌ను తాజా నోటీసుల్లో కోరింది. ఈ నోటీసుకు ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలని, ఈ నెల 29లోగా వ్యక్తిగతంగానూ లేదా ప్రతినిధి ద్వారా యూనివర్శిటీ జాయింట్ రిజిస్ట్రార్, ఎస్టేట్ ఆఫీసర్ అశోక్ మహతో ముందుకు హాజరు కావాలని తెలిపింది. శాంతినికేతన్ క్యాంపస్‌లో భూమిని అమర్త్యసేన్ అక్రమంగా ఆక్రమించుకున్నారని కొన్నేళ్లుగా విశ్వ భారతి అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను అమర్త్యసేన్ ఖండిస్తున్నా నోటీసులు పంపుతూనే ఉన్నారు. ఈ భూమిపై సంయుక్త సర్వే నిర్వహించాలని అమర్త్యసేన్ కోరుతున్నారు.