Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్లో లాయర్‌గా ఆమె తన పేరును నమోదు చేయించుకున్నారు. జీవితంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి కేరళలో మొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న పద్మాలక్ష్మికి ఈ సందర్భంగా కేరళ మంత్రి పి. రాజీవ్ అభినందనలు తెలిపారు. అనేక మంది ట్రాన్స్జెండర్లకు ఆమె ప్రేరణగా నిలుస్తా రని అన్నారు. బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందిలో పద్మాలక్ష్మీ కూడా ఒకరని, ఆమె ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టభద్రు రాలయ్యారని అన్నారు. అడ్వకేట్ కమ్యూనిటీకి అభినంద నలు, స్వాగతం అంటూ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.భారత్‌లో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా మారిన జోయితా మోండల్ లాగే పద్మాలక్ష్మీ ఘనత సాధించారని నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో ట్రాన్స్ జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో జడ్జిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఏడాది దేశంలో మూడో ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తిగా గువహతికి చెందిన స్వాతి బిధాన్ బారుV్‌ా నియమితులయ్యారు.