Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణ శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు ఆమోద ముద్ర వేసేలా గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పది బిల్లులను ఆమోదించలేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదన లు వినిపిస్తూ గవర్నర్ కార్యదర్శికి నోటీసులు ఇవ్వా లని కోరారు. గవర్నర్‌కు నోటీసులు ఇవ్వొద్దని సొలిస ిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. దీంతో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని తెలిపారు. గవర్నర్‌కు, కేంద్రా నికి నోటీసులు ఇస్తే అది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందనీ, గవర్నర్ పదవి రాజ్యాంగ బద్ధమైన దనీ, అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం సరికా దని తుషార్ మెహతా అన్నారు. తెలంగాణ ప్రభు త్వం చెబుతున్న బిల్లుల్లో కొన్నింటిని కొద్ది రోజుల కిం దటే పంపారనీ, అసలు విషయం ఏమిటో తెలు సుకొని కోర్టుకు నివేదిస్తానని తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 27 నాటికి కోర్టుకు వివరాలు తెలపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించి, తదుపరి విచారణను వాయిదా వేశారు.