Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో భాగం గా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ జపాన్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ప్రధాని మోడీ తో ఆయన చర్చించినట్టు పీఎం కార్యా లయం ఓ ప్రకటనలో తెలిపింది. భారత గడ్డపై స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ (ఎఫ్ఓఐపీ) పై తన కొత్త ప్రణాళికను ప్రకటించనున్నట్టు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. తమ దేశానికి భారత్ అత్యవసర భాగ స్వామి అని స్పష్టం చేశారు. ఎఫ్ఓఐపీని సాధించ డంలో తమ అనివార్య భాగస్వామి అయిన భారత్ గడ్డపై తన కొత్త దృక్పథాన్ని ప్రకటించడం తనకు సంతోషాన్ని కలిగించిందని ద్వైపాక్షిక చర్చల అనంతరం కిషిదా తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యవసర మని అన్నారు. ఈ ఏడాది మేలో జరగనున్న జీ-7 హిరోషిమా సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోడీని అధికారికంగా ఆహ్వానించారు. ప్రధాని వెంటనే అంగీకరించారని అన్నారు. జీ-7, జీ-20 సదస్సులను విజయవంతం చేయడానికి ఇరుదేశాలు సహకరిస్తాయని అన్నారు. అంతర్జాతీయ భాగ స్వామ్యంలో ముఖ్యంగా అభివృద్ధి, ఆర్థిక, ఆహారం, భద్రత, పర్యావరణంతో పాటు ఇతర అంశాలపై తమ ఆలోచనలను పంచుకున్నామని అన్నారు.