Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత వ్యతిరేక ముఠా..అంటూ కిరణ్ రిజిజు తీవ్రవ్యాఖ్యలు
- లక్ష్మణరేఖ దాటుతోందని బెదిరింపు..
- సీఈసీ నియామకాలపై సుప్రీం తీర్పుతో రగడ మొదలు..
- రిటైర్ట్ జడ్జీలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యాయవ్యవస్థతో బాహాబాహీకి దిగిన కేంద్రం
భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టుతో మోడీ సర్కార్ బాహాబాహీకి దిగు తోంది. సందర్భం దొరికితే చాలు... న్యాయ వ్యవస్థపై నిందలు వేస్తోంది. కార్యనిర్వా హక వ్యవస్థలో జోక్యం చేసు కుంటోందని సుప్రీంకోర్టుపై మాటల దాడి పెంచింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్కడికి వెళ్లినా.. సుప్రీంకోర్టుపై విమర్శలు ఎక్కుపెట్టడమే పనిగా వ్యవహరిస్తున్నారు. సీఈసీ (చీఫ్ ఎలక్షన్ కమిషనర్), ఇతర సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక, తన మాటల దాడిని కిరణ్ రిజిజు మరింత పెంచారు. పలు మార్లు 'సుప్రీంకోర్టు'ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ట్రిబ్యునల్స్ విషయంలో సుప్రీంకోర్టు విజయవంత మైన తీర్పులు వెలువరించింది. వీటిని కేంద్రం గాలికి వదిలేసింది. ట్రిబ్యునల్స్ ఏర్పాటు, సభ్యుల ఎంపిక, వాటి పాలనపై జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీం మూడు తీర్పులు వెలువరించినా, కేంద్రంలో చలనం లేదు.
న్యూఢిల్లీ : ఈనెల మార్చి 18న న్యాయవ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. రిటైర్డ్ జడ్డీలంతా భారత వ్యతిరేక ముఠాగా తయారయ్యారని, వారిని వదిలిపెట్టమంటూ బెదిరింపులకు దిగారు. ''కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయమూర్తులు తలదూర్చితే, నియా మకాలు చేపడితే..న్యాయ వ్యవస్థ పని ఎవరు చూస్తారు?'' అని కిరణ్ రిజిజు ప్రశ్నిం చారు. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటుతుందని అన్నారు. ఒక కేంద్ర మంత్రి..న్యాయవ్యవస్థపై ఈ విధంగా మాటల దాడికి దిగిన సందర్భం గతంలో ఎన్న డూ లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాం శమైంది.
ఈసీ విశ్వసనీయత పెంచాలనటం తప్పా?
కేంద్ర ఎన్నికల సంఘం మోడీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ప్రధాని మోడీ, బీజేపీ ముఖ్య నాయకుల సభలు, ప్రచారాలు, ప్రకటనలు ముగిసాక అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటం ఆనవాయితీగా మారింది. సీఈసీ పనితీరుపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్చి 2 నాటి తీర్పు వెలువరించింది. ఇది మోడీ సర్కార్కు రుచించలేదు. ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన ఒక అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకం జరపాలని తన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయటం ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను పెంచుతుందని తీర్పులో పేర్కొంది.
అత్యున్నత స్థాయి కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి ఒక సభ్యుడు మాత్రమే. ఈసీ సభ్యుల ఎంపికలో ఆయన నేరుగా పాల్గొనరు. ఎలాంటి వీటో అధికారమూ ఆయనకు లేదు. ప్రభుత్వ పాలన (కార్యనిర్వాహకం)లో జోక్యం చేసుకోవటమన్న ప్రశ్నే ఇక్కడ లేదు. ఈ తీర్పును కేంద్రం జీర్ణించుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ రిజిజు వ్యాఖ్యలున్నాయని తెలుస్తోంది. పార్లమెంట్ వేదికగా న్యాయవ్యవస్థ పనితీరును కేంద్రం తరుచూ తప్పుబడుతోంది. కొలీజయం అమల్లో లేకుండా చేయాలని రకరకాల నివేదికలు విడుదల చేస్తోంది. న్యాయ నియామకాల సిఫారసును కొలీజియం పునరుద్ఘాటించిన తర్వాత కూడా కేంద్రం న్యాయ నియామకాలను పెండింగ్లో ఉంచుతోంది. తాజాగా సీఈసీ, ఇతర సభ్యుల నియామకంపైనా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యంత బలమైన రాజకీయ నాయకుడి ముందు బానిసలా నిలబడే వ్యక్తి ఆ స్థానంలో (సీఈసీ) ఉండరాదని సంచలన తీర్పు వెలువరించింది.
న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా
ట్రిబ్యునల్స్, న్యాయపరమైన విధులను నిర్వర్తించే విషయంలో సంస్కరణలపై సుప్రీం ఆరు తీర్పులను వెలువరించింది. అయితే కేంద్రం ఆ తీర్పులను అమలుజేసేందుకు సుముఖంగా లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసే నిబంధనల్ని కొట్టేసిన ప్రతిసారీ, సుప్రీం తీర్పులను కేంద్రం అపహాస్యం చేస్తోంది. 'కొలీజియం' కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను 2015లో కేంద్రం తీసుకొచ్చింది. ఇందుకోసం భారత రాజ్యాంగ చట్టాలను సవరించింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటు చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సుప్రీం కొలీజియం జాబితాపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటం ద్వారా న్యాయ నియామకాలు జరుగుతాయని తెలిపింది. ఈ తీర్పును కేంద్రం గౌరవించటం లేదు. కొలీజియం సిఫారసులను పదే పదే తిరస్కరిస్తోంది. లేదంటే పెండింగ్లో పెడుతోంది.