Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 2018-2021 మధ్యకాలంలో దళితులపై జరిగిన దాడులు, నేరాలకు సంబంధించి 1,89,945 కేసులు నమోదయ్యాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది. పోలీసు, శాంతిభద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలుజేయటంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తరుచూ మార్గదర్శకాలు, సూచనలు జారీచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజరు కుమార్ మిశ్రా చెప్పారు.
2018 నుంచి ఇప్పటివరకూ దళితులపై జరిగిన దాడులు, నేరాల గణాంకాల్ని తెలపాలని, దాడి ఘటనలు, కేసులను పర్యవేక్షించే యంత్రాంగమేదైనా ఉందా? అని బీఎస్పీ ఎంపీ గిరీష్ చంద్ర ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా అజరుకుమార్ మిశ్రా పై సమాచారాన్ని విడుదల చేశారు.
దళితులపై జరుగుతున్న నేరాలు, ఘోరాల సమాచారాన్ని ఎన్సీఆర్బీ విడుదల చేస్తోందన్నారు. ఇందులో పొందుపర్చిన సమాచారాన్నే ఆయన తన సమాధానంలో ప్రస్తావించారు. గత రెండేండ్లలో న్యూఢిల్లీలో ప్రజాప్రతినిధులపై జరిగిన దాడుల అంశాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తారు. కేంద్ర సహాయమంత్రి నిత్యానందరారు స్పందిస్తూ..''ప్రజాప్రతినిధులపై దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నాలుగు కేసులు నమోదుచేశారు. 16మందిని అరెస్టు చేశారు. రెండు కేసుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు అయ్యింది. ఇలాంటి దాడులు జరగకుండా పోలీసు అధికారులు తమ తమ ప్రాంతంలో నిఘా ఉంచాలని ఆదేశించా''మని చెప్పారు.