Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి భగవంత్ కుబ
న్యూఢిల్లీ : ఎరువుల కొనుగోలు సమయంలో ఎరువుల విక్రయ కేంద్రాల (పీఓఎస్) వద్ద రైతులు 'కులం' పేరు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. సమాచార సేకరణకే ఈ నిబంధన పెట్టినట్టు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ కుబ తెలిపారు. ఎరువుల కొనుగోలు సమయంలో రైతుల కులం వివరాలు కోరుతున్నారా? అంటూ తమిళనాడుకు చెందిన పీఎంకె రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రాందాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. భవిష్యత్తులో కులాల ఆధారంగా రైతులకు ఎరువులపై రాయితీ వర్తింపజేసే ఆలోచన ఏమైనా ఉందా? అని ఎంపీ ప్రశ్నించగా అటువంటి యోచన పరిగణనలో లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు.
10,302 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ
ప్రభుత్వ రంగ సంస్థల్లో 10,302 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023 జనవరి 1 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో 5,768 ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు, 4,534 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
రైతులకు ఏపిలోనే అత్యధిక రుణభారం
దేశంలో రైతులపై అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి రైతుపై సగటున రూ.2,45,554.00 అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాడి వెల్లడించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రతి రైతుపై అప్పు విషయంలో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో ప్రతి రైతుపై రూ.1,52,113 అప్పున్నట్టు మంత్రి తెలిపారు.
రూ.6,627.86 విద్యుత్ బకాయిలు ఏపీకి తెలంగాణ చెల్లించాలి
తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఆ రాష్ట్రం తమకు రూ.6,627.86 కోట్లు (2021 ఏప్రిల్ 30 నాటికి) చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమి చ్చారు. విద్యుత్ సరఫరా చేసినందుకు గానూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌కు (2022 జులై 31 నాటికి) అసలు రూ.3,441,78 కోట్లు, ఆలస్యం చేసినం దుకు సర్‌చార్జి కింద రూ.3,315.14 కోట్లు (మొత్తంగా రూ.6,756.92 కోట్లు) చెల్లించాల్సి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.