Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవోపీటీ ఆదేశాల్ని రద్దు చేయాల్సిందే : సీఐటీయూ
- నిరసన..ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కు
- వారికి కార్మిక సంఘాల మద్దతు కొనసాగుతుంది : తపన్‌సేన్
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ సమ్మె, సామూహిక సెలవులు, ధర్నాలు, నిరసనలు చేపట్ట కుండా మోడీ సర్కార్ జారీచేసిన ఆదేశాల్ని రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఉద్యోగు లను హెచ్చరిస్తూ జారీచేసిన ఆదేశాల్ని, కేంద్ర ప్రభుత్వ దురహంకారాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులు సామూహికమైన వ్యక్తీకర ణలకు దిగరాదని, సమ్మె, నిరసనల్లో పాల్గొనరాదని ఆదేశిస్తూ డీవోపీటీ మార్చి 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు తేలితే ఉద్యో గులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలుంటాయని తెలిపింది. ఈ ఉత్తర్వులను ఖండిస్తూ బుధవారం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ప్రజా స్వామ్య హక్కులను కాలరాసే నిరంకుశ ప్రయత్నంగా పేర్కొన్నారు. ''కార్మిక వ్యతిరేక విధానాలకు మోడీ సర్కార్ ప్రసిద్ధిగాం చింది. దేశవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి నిరసనలు ఎదుర వుతున్నాయని భయపడుతోంది. వీటిని అణచివేసేందుకు రకరకాలుగా ప్రయ త్నిస్తోంది. పాత పెన్షన్ (ఓపీఎస్) కోసం జరుగు తున్న ఉద్యోగుల నిరసనలు, ఆందోళనలు మోడీ సర్కార్‌కు రాజకీయంగా సవాల్‌గా మారుతున్నా యి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతున్న ఉద్యోగుల నిరసనల్ని నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. జిల్లా స్థాయిల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ నిర్ణయించిన వెంటనే డీవోపీటీ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే కేంద్రం బెదిరింపులు ఉద్యోగుల నిరసనల్ని ఆపలేవు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేప డుతున్న ఆందోళనలు, నిరసనలకు సీఐటీయూ ఎప్పడూ అండగా నిలుస్తుంది. కార్మికసంఘాలు తమ మద్దతు కొనసాగిస్తా''యని తపన్‌సేన్ చెప్పారు.