Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిక్కర్ స్కాం కేసులో ప్రత్యేక కోర్టు ఆదేశం
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన్ని బుధవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో.. స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్, సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఆదేశించారు.