Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. గురువారం పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా భువనగిరి ఎంపీ నియోజక వర్గంలోని సమస్యలు, అభివృద్ధి అంశాలు, మెట్రో విస్తరణ, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా పలు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి కోసం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని ప్రధానిని కోరానన్నారు.