Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభ సచివాలయం సర్క్యులర్ జారీ
- సూరత్‌కోర్టు తీర్పునిచ్చిన తర్వాతి రోజే చర్యలు
ఖండించిన అన్ని పార్టీల నేతలు
నవ తెలంగాణ:రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై వేటు వేశారు. సూరత్‌కోర్టు తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రెటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. ''కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియో జకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్‌కోర్టు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేటు
దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. దోషిగా
తేలిన 2023 మార్చి 23 నుంచి అనర్హత వర్తిస్తుంది. రాజ్యాంగంలోని
ఆర్టికల్ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని పేర్కొంటూ లోక్‌సభ సచివాలయం సెక్రెటరీ
జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు.
బీజేపీ ఇలా చేస్తుందని ముందే తెలుసు : ఖర్గే
రాహుల్‌పై సూరత్‌కోర్టు ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లు రాహుల్ అనర్హత వేటుపై స్పందించారు. బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తున్నదని విమర్శించారు.
ఖండించిన సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు రాహుల్‌పై అనర్హత వేటును ఖండించారు.
బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట :కేరళ సీఎం విజయన్
ఇది ప్రజాస్వామ్యంపై సంఘ్‌పరివార్ హింసాత్మకదాడి. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట.
ప్రజాస్వామ్య విలువలకు పాతర : ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్
లోక్‌సభ ఎంపీలుగా రాహుల్ గాంధీ, ఫైజల్‌లపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు తగ్గుతున్నాయి. ఇది ఖండించదగినది. రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం. ప్రజాస్వామిక సంస్థలను కాపాడుకోవడానికి అందరం కలిసి నిలబడాలి.
బీజేపీ టార్గెట్‌గా ప్రతిపక్ష నేతలు : పశ్చిమ బెంగాల్ సీఎం మమత
ప్రధాని మోడీ నవ భారత్‌లో ప్రతిపక్ష నేతలే బీజేపీ లక్ష్యంగా మారారు. నేర చరిత ఉన్న బీజేపీ నాయకులు క్యాబినేట్లో చేరుతుంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం వారి ప్రసంగాలకు అనర్హత వేటుకు గురవుతున్నారు. ఈ రోజు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి కొత్త పతనాన్ని మనం చూశాం.
ప్రతిపక్ష నాయకులే లక్ష్యం : జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్
రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో కేంద్రం తన ప్రతీకార యుద్ధాలు ఎలా ఉంటాయో నిరూపిస్తున్నది. నేటి అమృత్ కాల్లో ప్రతిపక్ష నాయకులు బీజేపీకి ఏకపక్షంగా లక్ష్యంగా ఉన్నారు. అధికారాన్ని ఆయుధంగా ఉపయోగించి బలవంతంగా వారిని నిశ్శబ్దం చేస్తున్నది.
తొలుత ఫైజల్.. ఇప్పుడు రాహుల్ : ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే
పూర్తిగా నిరాశపర్చింది. తొలుత పి.పి మహ్మద్ ఫైజల్. ఇప్పుడు రాహుల్ గాంధీ. రాష్ట్రపతికి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఆర్టికల్ 103 ప్రకారం ఇలాంటి వివాదాల్లో అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉన్నదని వారు చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం రెండేండ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్షపడిన ప్రజా ప్రతినిధికి శిక్షాకాలంతో పాటు మరో ఆరేండ్లు పోటీ చేయడానికి వీలులేదు. ఈ లెక్కన రాహుల్ గాంధీకి 8 ఏండ్లు ఎన్నికల్లో పోటీకు అనర్హడవుతాడని రాజ్యాంగ నిపుణులు కొందరు తెలిపారు.
2013లో ఆ ఆర్డినెన్సును
రాహుల్ వ్యతిరేకించకుండా ఉంటే..
ప్రజా ప్రతినిధులకు శిక్ష పడిన వెంటనే అప్పీల్‌కు వెళ్లకుండా అనర్హత వేటు అమలులోకి వస్తుందని 2013లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిని నిలుపుదల చేసి, అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తూ నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ సమయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీలను నాటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చించివేశారు. దాంతో ఆర్డినెన్స్ నిలిచిపోయింది. నాడు ఆర్డినెన్స్ చట్టంగా మారి ఉంటే, ప్రస్తుతం రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడకుండా అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండేదని నిపుణులు తెలిపారు. కానీ ఆర్డినెన్స్ కార్యరూపం దాల్చకపోవడంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు అవకాశం లభించినట్టయ్యిందని చెప్పారు.
ఇప్పటి వరకు అనర్హతకు గురైన నేతలు
- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత గతంలో అనర్హతకు గురయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమెకు నాలుగేండ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా పడింది. దీంతో ఎమ్మెల్యే పదవికి ఆమె అనర్హురాలయ్యారు. దీంతో ఏకంగా సీఎం పదవి నుంచే దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కర్నాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో జయలలితకు అవరోధాలన్నీ తొలగిపోయాయి.
- బీహార్‌లోని సరన్ ఎంపీగా ఉన్న సమయంలో ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌పై 2013 సెప్టెంబర్‌లో అనర్హత వేటు పడింది. దాణా కేసులో ఐదేండ్ల జైలుశిక్షపడడమే దీనికి కారణం.
- లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ (ఎన్సీపీ)పై ఈ ఏడాది జనవరి 23న అనర్హత వేటు పడింది. హత్యాయత్నం కేసులో అయనను సెషన్స్ కోర్ట్ దోషిగా తేల్చింది. రెండేండ్లకుమించి జైలుశిక్షపడటమే ఇందుకు కారణమైంది. అయితే కేరళ హైకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆయనను లోక్‌సభకు రానీయకపోవటం గమనార్హం.
- రామ్‌పూర్ మాజీ ఎంపీ ఆజం ఖాన్ 2019లో విద్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలారు. రెండేండ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడడంతో ఆయనపై ఆ సమయంలో అనర్హత వేటుపడింది.
- ఈ జాబితాలో కమల్ కిశోర్ భగత్ (జార్ఖండ్ ఎమ్మెల్యే), సురేష్ హల్వాంకర్ (మహారాష్ట్ర ఎమ్మెల్యే), టి.ఎం సెల్వగణపతీ (తమిళనాడు ఎమ్మెల్యే), బాబన్‌రావ్ ఘోలప్ (మహారాష్ట్ర ఎమ్మెల్యే), ఎనోస్ ఎక్కా (జార్ఖండ్ ఎమ్మెల్యే), ఆశా రాణి (బీహార్ ఎమ్మెల్యే), జగదీష్ శర్మ (బీహార్ ఎమ్మెల్యే), పప్పు కలానీ (మహారాష్ట్ర ఎమ్మెల్యే) లు ఉన్నారు. వీరంతా వేర్వేరు నేరాల్లో దోషులుగా తేలి, జైలుశిక్షలు పడడంతో వీరంతా అనర్హతకు గురయ్యారు.
దేశం కోసమే నా పోరాటం
భారత్ గళాన్ని వినిపించేందుకే నేను పోరాటం చేస్తున్నాను.
ఈ క్రమంలో ఎంత మూల్యం
చెల్లించడా నికైనా సిద్ధమే.
- రాహుల్
నిరంకుశ దాడులను ప్రతిఘటిద్దాం : ఏచూరి
రాహుల్ గాంధీ మాదిరిగానే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వారిపై అనర్హత వేటు వేయడానికి బీజేపీ నేరపూరిత పరువు నష్టం మార్గాన్ని ఉపయోగిస్తుండడం ఖండించదగినది. ఇటువంటి నిరంకుశ దాడులను ప్రతిఘటించి ఓడించాలి.
ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు..
- మోడీ దురహంకారానికి పరాకాష్ట : సీఎం కేసీఆర్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో శుక్రవారాన్ని చీకటిరోజుగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని నరేంద్రమోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'రాజ్యాంగబద్ధ సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యు న్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం దాపురించింది. మోడీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేయటం ద్వారా మోడీ తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. తద్వారా ఆ పార్టీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి...' అని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నియంతలకు తలొంచం
ఒక అమరవీరుడి కొడుకును మోడీ భజన బృందం దేశ ద్రోహిగా అభివర్ణిస్తున్నది. మీరు ఏం చేయగలరో చేసుకోండి. కానీ.. ఒక పిరికిపంద, అధికార యావ ఉన్న మీ లాంటి నియంతముందు గాంధీ కుటుంబం తలవంచదు.
- ప్రియాంక
ప్రజాస్వామ్య శక్తులపై దాడి
భారత యువ నాయకుడు రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించే ఫాసిస్టు చర్యను నేను తీవ్రంగా ఖండి స్తున్నాను. ఈ చర్యను ఉపసం హరిం చుకోవాలి.
- తమిళనాడు సీఎం స్టాలిన్
షాక్‌కు గురి చేసింది
రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించడం విస్మ యాన్ని కలిగిస్తున్నది. దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వారు (బీజేపీ) దేశం మొత్తాన్ని భయబ్రాంతులకు గురి చేశారు. ఈ అహంకార శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి.
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్