Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సమయంలో విడుదలైన ఖైదీలు, విచారణ ఖైదీలందరూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యవసర బెయిల్పై విడుదలైన విచారణ ఖైదీలు లొంగిపోయిన తరువాత రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కరోనా సమయంలో విడుదలైన ఖైదీలందరూ లొంగిపోయిన తరువాత తమ శిక్షను రద్దు చేసుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చనని తెలిపింది.