Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 64 అధికారిక సవరణలు
- ఎలాంటి చర్చా లేకుండానే ముగిసిన తంతు
- సభ్యుల గందరగోళం నడుమనే మూజువాణి ఓటుతో ఆమోదం
న్యూఢిల్లీ : 2023 సంవత్సరం ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభ్యుల గందరగోళం నడుమనే మూజువాణి ఓటుతో సభ ఈ బిల్లును ఆమోదించింది. దీంతో 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును లోక్సభ పూర్తి చేసింది. ఈ బిల్లులో మొత్తం 64 అధికారిక సవరణలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎలాంటి చర్చా లేకుండానే ఆర్థిక బిల్లు ఆమోదం పొందటం గమనార్హం. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాబోయే ఆర్థిక సంవత్సరానికి ఈ బిల్లు పన్ను ప్రతిపాదనలను అమలు చేయనున్నది. ఈ బిల్లు ఆమోదం సమయంలో ప్రతిపక్ష నాయకులు అదాని గ్రూపు కంపెనీలపై వచ్చిన ఆరోపణల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పట్టుబట్టారు. దీంతో సభలో సభ్యుల గందరగోళం నడుమనే బిల్లు పాసైంది. ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులో పెన్షన్ సమస్యల గురించి కమిటీ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. విదేశీ పర్యటనల్లో క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తుందని ఆమె అన్నారు. కాగా, ఆర్థిక బిల్లులో సవరణలతో కొత్తగా 20 సెక్షన్లు వచ్చి చేరాయి. లోక్సభలో ఆమోదం తర్వాత ఆర్థిక బిల్లు రాజ్య సభకు వెళ్లనున్నది.