Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. పది ముఖ్యమైన బిల్లులను ఆమోదించడం లేదని, ఆయా బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, కనుక తమకు సమయం కావాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు పిటిషన్‌పై విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ధర్మాసనం వాయిదా వేశారు.