Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన బడ్జెట్ కేటాయింపులు
- మార్పులతో కార్మికులకు ఉపాధి దూరం
- ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర :బి. వెంకట్
న్యూఢిల్లీ : దేశంలో ఉపాధి హామీ పనులు పడిపోయాయి. స్కీమ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డేటా విశ్లేషణ ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో సృష్టించబడిన ఉపాధి గత నాలుగేండ్లలో మొదటి సారిగా కోవిడ్‌కు ముందు స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద రూపొందించిన వ్యక్తుల సంఖ్య 20.69 కోట్లు, 2022 జనవరి (26.97 కోట్లు), 2021 జనవరి (27.81 కోట్లు), 2020 జనవరి (23.07 కోట్లు) కంటే తక్కువగా నమోదైంది. ఫిబ్రవరిలో కూడా 20.29 కోట్లు, ఇది అంతకుముందు సంవత్సరాల్లోని సంబంధిత నెల కంటే తక్కువగా ఉంది. 2022లో 26.99 కోట్లు, 2021లో 30.79 కోట్లు, 2020లో 26.75 కోట్లు ఉపాధి నమోదైంది. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి సమాచారం లేదు.
ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినా ఉపాధి కింద పని కోసం డిమాండ్ పెరిగింది. 2020 జూన్‌లో స్కీమ్ కింద 64 కోట్లకు పైగా పర్సనల్-డేలు రూపొందిం చబడినప్పుడు ఇది గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పటి నుండి ఉపాధి హామీ చట్టం కింద రూపొందించ బడిన వ్యక్తుల-రోజుల నెలవారీ సంఖ్య కోవిడ్‌కు ముందు (ఆర్థిక సంవత్సరం 2019-20) కంటే ఎక్కువగా ఉంది. అయితే ఈ సంవత్సరం జనవరి నుండి, కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిల కంటే వ్యక్తి గత రోజుల సంఖ్య తక్కువగా ఉంది. అదే విధంగా ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య కూడా తగ్గిపోయింది. 2023 ఫిబ్రవరిలో 1.67 కోట్ల కుటు ంబాలు ఉపాధి పొందాయి. ఇది 2022 ఫిబ్రవరి (2.02 కోట్లు), 2021 ఫిబ్రవరి (2.28 కోట్లు), 2020 ఫిబ్రవరి (1.87 కోట్లు) కంటే తక్కువ.
మార్పులతో కార్మికులకు ఉపాధి దూరం
ఉపాధి హామీ చట్టం అమలుకు సంబంధించిన అనేక మార్పుల వల్ల కూడా కార్మికులు ఉపాధికి దూరం అవుతున్నారు. 2023 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ (ఎన్ఎంఎంఎస్)తో హాజరును గుర్తించడాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. కార్మికులు కూడా 'ఉపాధి' పోర్టల్‌లో అప్లోడ్ చేసిన రెండు టైమ్ స్టాంప్, జియోట్యాగ్ చేయబడిన ఫొటోగ్రాఫ్‌లను పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థతో పౌరుల పర్యవేక్షణను పెంచడం, పాలన సౌలభ్యం లక్ష్యంగా ఉందని మంత్రిత్వ శాఖ వాదిస్తున్నప్పటికీ, ఇది చట్టం అమలులో అవరోధాలను సృష్టిస్తోంది. అలాగే కార్మికుల వేతనాలను చెల్లించడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్) వినియోగాన్ని కూడా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నుండి తప్పనిసరి చేసింది. దీనివల్ల వ్యవసాయ కార్మికులు ఉపాధికి దూరం అవుతున్నారు. ఈ కొత్త హాజరు, చెల్లింపు వ్యవస్థలను వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తగ్గిన బడ్జెట్ కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం కావాలనే ఉపాధి హామీకి నిధులను తగ్గిస్తోంది. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీకి భారీగా కోతలు విధించింది. 2020-21లో ఉపాధి హామీకి రూ.1,11,500 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 2021-22లో రూ.98 వేల కోట్లకు తగ్గించింది. 2023-24 బడ్జెట్లో అదికాస్తా రూ.60 వేల కోట్లకు తగ్గించింది.
ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిల భారత వ్యకాస (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. కుట్రలో భాగంగానే ఒక పక్క బడ్జెట్ కేటాయింపులు తగ్గి స్తుందని, మరోపక్క చట్టం అమలులో మార్పులు చేస్తుందని మండిపడ్డారు. ఈ చట్టం అమలులో బయో మెట్రిక్, ఆధార్ ఆధారిత చెల్లింపులతో ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని, దీని వల్ల కార్మికులు ఉపాధికి దూరం అవుతారని అన్నా రు. కార్మికులు ఉపాధికి దూరమైతే, ఈ చట్టాన్ని పూర్తిగా లేకుండా చేయొచ్చనే ప్రభుత్వ అజెండాలో భాగంగానే మార్పులు చేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర కోత విధిస్తున్నారని, ఇది ఉపాధి హామీ చట్టం అమలుకు అడ్డంకిగా ఉంటుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ఇతర సంఘాలతో కలిసి ఏఐఏడబ్ల్యూయూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతుందని పిలుపునిచ్చారు. బి.వెంకట్