Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్దిష్ట నిర్వచనం లేనివిగా గుర్తింపు
న్యూఢిల్లీ: 'షెల్ కంపెనీల' గురించి ఎటువంటి సమాచారం లేదని గతంలో మోడీ ప్రభుత్వం చెప్పినప్పటికీ.. 2018-2021 మధ్య 2,38,223 కంపెనీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే షెల్ కంపెనీలుగా లేబుల్ చేసి వాటి గురించి ఎలాంటి సమాచారాన్ని పంచుకోకపోవడం గమనార్హం. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ జూలై 27, 2021న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ మహువా మిత్రా దీనిని ఎత్తిచూపారు. ''చట్టంలో నిర్దిష్ట నిర్వచనం లేకుండా 2018 మరియు 2021 మధ్య ప్రభుత్వం 2,38,223 షెల్ కంపెనీలను గుర్తించడం విచిత్రంగా ఉంది'' అని అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన పత్రికా ప్రకటనలో ''షెల్ కంపెనీ' అనే పదం కంపెనీల చట్టంలో నిర్వచించబడలేదని పేర్కొన్నది. సాధారణంగా యాక్టివ్ బిజినెస్ ఆపరేషన్లో లేని లేదా గణనీయమైన ఆస్తులు లేని కంపెనీని సూచిస్తుందని వివరించడంత గమనార్హం. భారతీయుల ఆఫ్షోర్ ఖాతాలకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని కేంద్రం ఇప్పుడు పార్లమెంటుకు తెలిపింది. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అదానీకి చెందిన 'షెల్ కంపెనీల'లో రూ.20,000 కోట్లు 'అకస్మాత్తుగా వచ్చాయని' రాహుల్ గాంధీ ప్రకటించిన వెంటనే ఈ విషయం వెల్లడి కావడం గమనార్హం.