Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైజల్ 'అనర్హత' పిటిషన్‌పై సుప్రీం
న్యూఢిల్లీ: తనపై అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్ తొలగించక పోవడంపై లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్.. మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కొచ్చింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్ కె.ఎం. జోసఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం.. ఇందులో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే ముందని ప్రశ్నించింది. పిటిషనర్ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది. ఓ హత్యా యత్నం కేసులో ఫైజల్‌కు 10 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు తీర్పుని చ్చిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనను అనరుÛ్హడి గా ప్రకటించింది. దీనిపై ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. జైలుశిక్ష తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించినప్పటికీ తన సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రెటేరియట్ పునరు ద్ధరించలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే ఫైజల్ పిటిషన్ నేడు ధర్మా సనం ముందుకు రాగా.. కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ''ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితేనే ఆర్టికల్ 32 కింద వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ కేసులో ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు గురైంది?'' అని ధర్మా సనం ప్రశ్నించింది. దీనికి ఫైజల్ తరఫు న్యాయవాది బదులిస్తూ.. 'తన నియో జకవర్గానికి ప్రాతినిధ్యం వహించే హక్కును తీసేసుకున్నారు' అని సమా ధానమిచ్చారు. దీంతో కోర్టు స్పందిస్తూ.. 'అది ప్రాథమిక హక్కు ఉల్లంఘన అవుతుందా?' అని మరో ప్రశ్న వేసింది. అయితే, జైలు శిక్షపై స్టే విధిం చినా.. అనరÛ్హతను ఎత్తివేసేందుకు నిరాకరించడం ఏకపక్ష నిర్ణయమని, దీనిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలి వ్వాలని ఫైజల్ న్యాయవాది ధర్మాసనాన్ని కోరా రు. ఇక, ఈ పిటిషన్‌పై ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ధర్మా సనం ప్రశ్నించగా.. ''జైలు శిక్షపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ లక్ష ద్వీప్ అడ్మి నిస్ట్రేషన్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నందున.. నేరుగా ఇక్కడికే వచ్చా ం'' అని ఫైజల్ తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఈ వివరణ అనంతరం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడుతామని ధర్మాసనం వెల్లడించింది.