Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభ సెక్రెటేరియట్‌కు రాహుల్ లేఖ
న్యూఢిల్లీ : తన హక్కులకు భంగం వాటిల్లకుండా అధికారులు లేఖలో పేర్కొన్న విధంగా బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం తెలిపారు. అధికారుల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తా నని పేర్కొంటూ లోక్‌సభ సెక్రెటేరియట్‌కు ఓ లేఖ రాశారు. 12- తుగ్లక్ లేన్‌లో నాకు కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయమంటూ లోక్‌సభ సెక్రెటేరియట్ పంపిన లేఖ అందింది. అందుకు కృతజ్ఞతలు. ప్రజల తీర్పుతో నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నేను ఈ బంగ్లాలో ఉంటున్నాను. ఇక్కడ నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగకుండా.. లేఖలో పేర్కొన్న విధంగా వ్యవహరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. అది నా బాధ్యత. బంగ్లాను ఖాళీ చేస్తా'' అని రాహుల్ తన లేఖలో వెల్లడించారు. పరువు నష్టం కేసులో రెండేండ్లపాటు జైలు శిక్ష పడటంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం.. నెల రోజుల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 12- తుగ్లక్‌లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైనే రాహుల్ స్పందించారు. మరోవైపు, లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌కు ఉండే ప్రయోజనాలన్నింటినీ కూడా అధికారులు పున్ణపరిశీలిస్తున్నారు.