Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రకోట వద్ద శాంతి కాగడా మార్చ్ ... నేతలను అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు వ్యతిరేకిస్తూ, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పరిరక్షణ శాంతి కాగడ ప్రదర్శన నిర్వహించాయి. మంగళవారం నాడిక్కడ ఎర్ర కోట నుంచి పాత ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో టౌన్ హాల్ వరకు ప్రతిపక్ష నేతలు కాగడ మార్చ్ నిర్వహించారు. అయితే శాంతి భద్రతల సమస్యలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. సీఆర్పీసీ సెక్షన్ 144 ఆంక్షలు విధించారు. వేదిక వద్దకు వెళ్లకుండా ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది నేతలను వాహనాల్లోకి కుక్కి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలని నినాదాల హౌరెత్తించారు. నియంతకు తాము భయపడమని నేతలు పేర్కొన్నారు.