Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022-23కు 8.15శాతంగా నిర్ణయం
న్యూఢిల్లీ : ఉద్యోగ, కార్మికుల పీఎఫ్‌పై కేవలం 5 పైసలు వడ్డీ పెంచారు. ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కు గాను 8.15 శాతం వడ్డీ చెల్లించడానికి మంగళవారం జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు ట్రస్టీ ప్రతిపాదనలు పంపించనున్నది. ఇంతక్రితం 2021-22లో 8.10 శాతం వడ్డీని అందించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం. దీంతో పోల్చితే అతి స్వల్పంగా 0.05 శాతం లేదా 5 పైసల పెంపుదల చోటు చేసుకుంది. కేంద్రం నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును అధికారికంగా గెజిట్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత వడ్డీని ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. మోడీ సర్కార్ అధికారంలోకి రాక ముందు 2013-14లో పీఎఫ్‌పై గరిష్టంగా 8.75 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. క్రమంగా దీన్ని తగ్గిస్తూ వచ్చింది. ఈపీఎఫ్ఓలో 5 కోట్ల పైగా ఖాతాదారులు ఉన్నారు.