Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీఎల్పీ స్కూళ్ల మూతతో అంధకారంలో బాలకార్మికుల భవితవ్యం
- పెరిగిన డ్రాపౌట్లు.. పట్టించుకోని మోడీ ప్రభుత్వం
- ఉద్యోగాలను కోల్పోయిన 36 వేల మంది ఉపాధ్యాయులు
- విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తల ఆందోళన
దేశంలో బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకుపోయి.. ఉచిత నిర్బంధ విద్యకు దూరమైన చిన్నారుల కోసం ఉద్దేశించిన జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ) పాఠశాలలు ఏడాది నుంచి మూసివేయబడి ఉన్నాయి. స్కూళ్ల మూసివేత కారణంగా ఉపాధ్యాయులు నిరుద్యోగులయ్యారు. ఈ స్కూళ్లను రెగ్యులర్‌గా నడిచే ప్రభుత్వ స్కూళ్లతో కలపడం కారణంగా అక్కడి విద్యార్థుల స్థాయిలో బాల కార్మికులు చదవలేకపోతున్నారు. ఫలితంగా డ్రాపౌట్లు అధికమవుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, స్కూల్‌కు వెళ్లాల్సిన చిన్నారుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడిందని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు
న్యూఢిల్లీ : ఎన్సీఎల్పీ స్కూళ్ల మూసివేతతో లక్షలాది బాలకార్మికులు తమ విద్యావకాశాలను, దాదాపు 36 వేల మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వీధిన పడిన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 15న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనను కూడా చేశారు. స్కూళ్ల మూసివేత కారణంగా ఉపాధ్యాయులు ఎంత నష్టపోయారో.. పిల్లలు కూడా అంతే బాధపడ్డారని ఉపాధ్యాయుడొకరు అన్నారు. ''సంవత్స రాలుగా వ్యక్తిగత శ్రద్ధతో.. పిల్లల ఇండ్లను క్రమం తప్పకుండా చుట్టుముట్టిన తర్వాత విద్యలోకి వచ్చిన ఏ పిల్లవాడినైనా సాధా రణ ప్రభుత్వ పాఠశాలలో సర్దుబాటు చేయడం సాధ్యం కాదు. వారి తోటివారు వారి కంటే చాలా చిన్నవారు. వారు ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి కష్టపడుతుంటారు'' అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉపాధ్యాయుడు, నేషనల్ చైల్డ్ లేబర్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఫిరోజ్ షేక్ అన్నారు. 10-11 సంవ త్సరాల వయస్సులో తన విద్యను ప్రారంభించిన పిల్లవాడు అదే తరగతిలోని 6 సంవత్సరాల పిల్లల తో సర్దుబాటు చేయడం అసాధ్యమని తెలిపారు. భార్గవ్ పప్పు(45) మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లాకు చెందినవారు. 2006 నుంచి ఎన్సీఎల్పీ పాఠశాల ప్రాజెక్ట్‌ల కింద బోధిస్తున్నాడు. అతను అడవుల మధ్య ఉన్న ప్రాంతంలో బోధించేవాడు. ఇక్కడ పిల్లలు ప్రధానంగా ఆదివాసీలు, కలప సేకరించే వారు. ''వారు వచ్చిన ప్రాంతం, తల్లిదండ్రులు ఇద్దరూ సాధారణంగా 'దేశీ' మద్యం సేవిస్తారు. ఇంటిని నడపడానికి, వారి మద్యం ఖర్చులకు అవసరమైన కనీస మొత్తాన్ని సంపాదించడానికి వారు తమ పిల్లలను ఇలాంటి పనులకు పంపుతారు'' అని తెలిపాడు.90వ దశకం చివరిలో ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు ఉపాధ్యాయులను ఎంపిక చేసుకునే ప్రమాణాలు చాలా సరళంగా ఉన్నాయి. వారు తమ విద్యార్హత వివరాలతో పాటు స్థానిక పత్రాలను సమర్పించాలి. తర్వాత రాత పరీక్షలు, వైవాలు కూడా తీసుకున్నారు. అయిన ప్పటికీ, ఇది ఇప్పటికీ చాలా సులభం. మరోవైపు, ఈ ఉపాధ్యాయులను 'సేవ'లో ఉంచలేదు. వారికి ఇచ్చేది కేవలం గౌరవ వేతనం మాత్రమే. ఇది 90వ దశకం చివరిలో దాదాపు రూ. 800గా ఉండేది. 2022 మార్చి చివరి నాటికి కార్యక్రమం మూసి వేయబడినప్పుడు అది కేవలం రూ.1400కి మాత్రమే పెరిగింది. చెల్లింపులు సరిగా లేకపోవడం తో ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం ఇతర పనులు వెతుక్కోవాల్సి వచ్చింది. కొందరు ఆటోరిక్షా నడిపారు. మరికొందరు పూర్తి సమయం వ్యవసాయం, పార్ట్‌టైమ్ బోధనను ఆశ్రయించారు. మిగిలినవారు నెలవారీ ఖర్చులకు ట్యూషన్లు చెప్పడం వంటివి చేశారు. పలు సందర్భాల్లో ఉన్న కొద్దిపాటి జీతం కూడా సరిగ్గా అందలేదని తెలి పారు. జార్ఖండ్‌కు చెందిన కొందరు ఉపాధ్యాయు లు తమకు గత ఆరేండ్లుగా వేతనాలు ఇవ్వడం లేదని చెప్పారు. తాము ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిన పిల్లల్లో నేడు కొందరు వైద్యులు, మరికొందరు ఇంజినీర్లు, మరికొందరు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు.ఈ స్కూళ్లను మూసివేసి నప్పటి నుంచి అనేక మంది విద్యార్థులు తిరిగి బాల కార్మికులుగా మారిపోయారని ఉపాధ్యా యులు, సామాజిక కార్యకర్తలు చెప్పారు. ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకొచ్చి, వారి భవిష్యత్తులో కాంతులు నింపిన అలాంటి స్కూళ్లను మూసివేయం సరైనది కాదని పూర్వ విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.