Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులకు వీహెచ్ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాహుల్ గాంధీ ఓబీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజరు చేస్తున్న వాదనను కాంగ్రెస్‌పార్టీ మాజీఎంపీ వి.హనుమంతరావు కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించపరిచారంటూ ఆ నాయకులు చేస్తున్న వాదనపై ఏప్రిల్ ఒకటిన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఆదానీ అక్రమాలపై ప్రశ్నించినందుకు క్షమాపణ చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏమి చేశాయి? తొమ్మిదేండ్లుగా బీజేపీ ఏమి చేసిందనే దానిపై సమావేశం చర్చిస్తామని తెలిపారు. కేవలం ఆదానీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఓబీసీ అంశాన్ని ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నదని విమర్శించారు. సమావేశంలో ఓబీసీ మేధావులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వాయినాడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసి నిర్ణయం తీసుకుందనీ, సీఈసికి ఉన్న ఆలోచన పార్లమెంట్లో స్పీకర్ లేదని స్పష్టమైందన్నారు. స్పీకర్ బీజేపీ పార్టీకి తొత్తుగా పని చేస్తున్నారని విమర్శించారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతారామ కల్యాణం సందర్భంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొని శ్రీరాముడి ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు.