Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకినాడ : కాకినాడ సముద్రపు ఒడ్డు నుంచి 20 కిలో మీటర్ల దూరంలో నిర్వహించిన ఇండియన్ కోస్ట్‌గార్డ్-రీజనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ (సారెక్స్-2023) విజయవంతమైనట్టు కాకినాడ కోస్ట్‌గార్డ్ స్టేషన్ కమాండెంట్ టిఆర్కె రావు తెలిపారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్-కాకినాడ స్టేషన్ ఆధ్వర్యాన సముద్రంలో విపత్తు స్పందన, నిర్వహణపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. చమురు నౌకలో అగ్ని ప్రమాదం సంభవించగా మంటలను అదుపులోకి తెచ్చి నౌక సిబ్బందిని, ప్రయాణికులను రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ చూపిన ధైర్యసాహసాలు, శక్తిసామర్థ్యాలకు ఈ మాక్ డ్రిల్ ప్రతిబింబంగా నిలిచింది. సముద్రంలో పడిపోయిన వారిని స్పీడ్ బోట్లతో రక్షించడం, చేతక్ హెలికాప్టర్‌తో గజ ఈతగాళ్లను సముద్రంలోకి దింపడం, ప్రమాదంలో ఉన్న వారిని రక్షించి, మెడికల్ నౌకలోకి చేర్చడం వంటి వాటిని ప్రదర్శించారు. మాక్ డ్రిల్‌లో రిమోట్‌తో పని చేసే లైఫ్ బోట్లు ఆకట్టుకున్నాయి. కమాండెంట్ టిఆర్కె.రావు మాట్లాడుతూ భారత తీరప్రాంత గస్తీ దళం ప్రపంచంలో అత్యుత్తమ తీరప్రాంత రక్షణ దళాల్లో ఒకటిగా కొనసాగుతోందన్నారు. సహజ విపత్తులు లేదా ప్రమాదవశాత్తు నౌకల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చూసేందుకు కోస్ట్‌గార్డ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.