Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2,500 కోట్లు విడుదల చేయండి
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ వినతి
న్యూఢిల్లీ :రాష్ట్రానికి ఇవ్వాల్సిన సుమారు రూ.2,500 కోట్ల ఉపాధి హామీ బకాయిలను కేంద్రం వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గురువారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె నివాసంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. దాదాపు 40 నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో వారు వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షాను సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసిన తరువాత విడుదల చేసిన ప్రకటనలోని అంశాలనే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 2021-22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపికి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.36,625 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే పోలవరం నిధులు కూడా విడుదల చేయాలని తెలిపారు. తెలంగాణ నుంచి ఏపికి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.7,058 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని కోరారు.