Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు
నవ తెలంగాణ:భారతదేశంలో ప్రతి ఏటా యూనివర్సిటీల నుంచి చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే చదివిన అందరికి ఉద్యోగాలు లభించక పోవడంతో నిరుద్యోగ సమస్య తారా స్థాయికి చేరుకుంటోంది. దీనిని దష్టిలో ఉంచుకుని గతంలో ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఉద్యోగం లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అది ఇప్పుడు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 01 నుంచి (ఏప్రిల్) నిరుద్యోగ యువతకు రూ. 2,500 నిరుద్యోగ భృతి అందించనున్నారు. దీని కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏకంగా రూ. 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించింది. ఇది మాత్రమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, హౌస్‌గార్డులు, గ్రామ కొత్వార్‌లు, ఇతర ఉద్యోగుల జీతాలు కూడా పెంచనున్నట్లు గతంలో సీఎం భూపేశ్ భఘేల్ తెలిపారు, ఇది కూడా అమలయ్యే అవకాశం ఉంది.
నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హతలు:
నిరుద్యోగ భృతి తీసుకోవడానికి తప్పకుండా ఛత్తీస్గడ్ నివాసితులై ఉండాలి. అంతే కాకుండా 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న యువకులు దీనికి అర్హులు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి.
నిరుద్యోగ యువత ఛత్తీస్‌గడ్‌లోని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గైడెన్స్ సెంటర్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకుని ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ రెండేళ్లుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నిరుద్యోగ భృతికి అర్హత పొందుతారు.
నిరుద్యోగ భృతి ఎలా అందుతుంది?
నిరుద్యోగ యువతకు పైన చెప్పిన అన్ని అర్హతలు, అదే సమయంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుని ఉన్నప్పుడే నెలకు రూ. 2,500 లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి జమ అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించడానికి నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు సంబంధింత అధికారులు చెబుతున్నారు.