Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 12న హాజరు కావాలని ఆదేశాలు
పాట్నా : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కష్టాలు తీరడం లేదు. సూరత్ కోర్టు రెండేండ్ల శిక్ష విధించడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పాట్నా హైకోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. సుశీల్ మోడీకి సంబంధించిన పరువు నష్టం కేసులో ఏప్రిల్ 12న హాజరు కావాలని రాహుల్ గాంధీని పాట్నా హైకోర్టు ఆదేశించింది. అయితే రాహుల్ వస్తారో రారో ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.