Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి వ్యతిరేకంగా 11భాషల్లో పోస్టర్లు
- నేడు దేశవ్యాప్తంగా ఆందోళన : ఆప్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రానికి, ఆప్ ప్రభుత్వానికి మధ్య 'పోస్టర్ల' యుద్ధం మరింత ముదిరింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 11 భాషల్లో పోస్టర్లను విడుదల చేయనున్నట్టు గురువారం ఆప్ తెలిపింది. మార్చి 30(శుక్రవారం) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో పోస్టర్లను ప్రదర్శించనుందని ఆప్ నేత, ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 11 భాషల్లో ఈ పోస్టర్లను ముద్రించామనీ, వాటిని ఆయారాష్ట్రాల్లో అంటించనున్నట్టు వెల్లడించారు.ఇటీవల ఢిల్లీలోని అన్ని గోడలు, విద్యుత్ స్తంభాలపై 'మోడీ హటావో, దేశ్ బచావో' అన్న పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పోస్టర్లపై 49 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో పాటు ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసినందుకు ఈ అరెస్టులు జరిగినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన వారిపై బ్రిటిషోళ్లు కూడా అరెస్టులకు పాల్పడలేదని మండిపడ్డారు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ అనేకపోస్టర్లు అంటించారనీ, కానీ ఆయనపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని అన్నారు. ఆప్‌కి వ్యతిరేకంగా ' కేజ్రీవాల్ హటావో, ఢిల్లీ బచావో ' పోస్టర్లతో బీజేపీ ఎదురు దాడికి పాల్పడింది.