Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది రోజు సెన్సెక్స్ 1031 పాయింట్ల వృద్థి
ముంబయి : ఆర్థిక సంవత్సరం తుది రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 1031 పాయింట్లు పెరిగి 58,992కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 279 పాయింట్లు రాణించి 17,381 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభం వల్ల నెలకొన్న ఆందోళనలు క్రమంగా తొలగిపోవడంతో మార్కెట్లలో విశ్వాసం పెరిగింది. గత కొన్ని రోజులుగా దేశీయ సూచీల్లో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. తక్కువ ధరల వద్ద సూచీలు ఉండటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.
రూ.3.6 లక్షల కోట్లు ఆవిరి..
గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్కెట్లకు చేదు అనుభ వాన్ని మిగిల్చింది. 2023 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో బిఎస్ఇ సెన్సెక్స్‌లోని టాప్ 30 సూచీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.3.6 లక్షల కోట్లు ఆవిరై రూ.113.58 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలానికి వీటి విలువ రూ.117.23 లక్షల కోట్లుగా ఉంది. ఐటి రంగం 21 శాతం, లోహ సూచీ 17 శాతం, టెలికం 15.91 శాతం, రియాల్టీ 14.28 శాతం చొప్పున పడిపోయాయి. అధిక ధరలు, హెచ్చు వడ్డీ రేట్లు, ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలు, అదానీ గ్రూపు అక్ర మాలతో కార్పొరేట్ కంపెనీలపై ఇన్వెస్టర్లకు విశ్వాసం సన్నగిల్లింది.