Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్: మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది మే నుంచి జైల్లోనే ఉన్న ఆయన.. ఏప్రిల్ 1న బయటకు రానున్నారు. ఈ విషయాన్ని సిద్ధూ తరఫు న్యాయవాది వెల్లడించారు. సత్ప్రవర్తన కలిగిన దోషి శిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. శిక్ష తగ్గింపునకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.మరోవైపు సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ బారిన పడినట్లు ఇటీవల వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో వేదికగా స్వయంగా వెల్లడించారు. అయితే, ఇటువంటి ఆపద సమయంలో భర్త కోసం ఎంతో వేచిచూస్తున్నానని అన్నారు. జైల్లో ఉన్న సిద్ధూ కంటే బయట ఉన్న తానే ఎక్కువ బాధను అనుభవిస్తున్నానంటూ నవ్‌జ్యోత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలాఉంటే, 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంలో జరిగిన ఘర్షణలో 65ఏళ్ల గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూతోపాటు రూపిందర్ సింగ్‌పై దాడి చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ ముగిసిన అనంతరం.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పువెలువరించింది. దీంతో మే 20న సిద్ధూ కోర్టుముందు లొంగిపోయిన ఆయన్ను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.