Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగపాల్ ఈనెల 24న సిసోడియా బెయిల్ అభ్యర్థనపై తీర్పును మార్చి 31కి వాయిదా వేశారు. ఆ తీర్పును శుక్రవారం వెలువరించారు. సిసోడియా రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ను వ్యతిరేకిస్తూ సీబీఐ లిఖిత పూర్వకమైన వివరాలు కోర్టుకు తెలియజేసిందని, కాపీ ప్రతిని సిసోడియా న్యాయవాదికి ఇవ్వడం జరుగుతుందని, కేసు డెయిరీ, సాక్ష్యుల వివరాలకు సంబం ధించిన కాపీని కూడా అందుబాటులో ఉంచుతామని ప్రత్యేక న్యాయమూర్తి తెలిపారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలు విషయంలో అవినీతికి ఆరోపణలపై సిసోడియాను ఇంతవరకూ ఏడు రోజుల పాటు సీబీఐ ప్రశ్నించింది. ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. దీంతో తీహార్ జైలుకు వెళ్లిన ఆయ నను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరైట్ మార్చి 9న అరెస్టు చేసింది. కాగా, సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 5 వరకూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది.