Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత విభజన ఒకనాటి కళావైభవానికే పాతరేస్తోంది.
- హిందూవుల పండగల్లో మూగబోతున్న ముస్లింల అరుదైన కళా ప్రదర్శనలు
- జీవనోపాధి కరువై కళాకారుల ఇక్కట్లు
ఓ అరుదైన సంగీత జాతి మతతత్వానికి బలైపోతున్నది. హిందూవుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముస్లిం జోగిలు వినసొంపైన పాటలు ఆలపించే ఓ అరుదైన చరిత్ర కనుమరుగైపోతున్నది. సామాన్యులకు సైతం అర్ధమయ్యేరీతిలో ఇతిహాసాలు వల్లించే ఓ చారిత్రకక్రమం క్రమంగా అంతరించిపోతున్నది. ఈ దేశంలో మతాతీతమైన సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంగీత కచేరీ కనిపించకుండా పోతున్నది. ఇదంతా కేవలం ఇటీవల ప్రబలుతున్న మత విద్వేషాల కారణంగానే. ఈ మతతత్వం తీరుతో ముస్లిం జోగిలకు జీవనోపాధి కరువైపోవడమే కాదు..ఓ అద్భుత సంగీత ప్రస్థానమే ఆగిపోతున్నది.
న్యూఢిల్లీ : భారత్‌లో శతాబ్దాలుగా వర్ధిల్లి, తమ కచేరీలతో నిత్యం బిజీగా ఉండే ముస్లిం జోగిల సంగీతం మూగబోతున్నది. వారి జీవితం ప్రాధాన్యతను కోల్పోతున్నది. ముస్లిం జోగిలు అయినప్పటికీ హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పాటలు పాడటం, ఇతిహాసాలు విప్పి చెప్పటం, సంగీత కచేరిలు నిర్వహించడం వీరి ప్రత్యేకత. ఈ దేశంలో మతాతీమైన సామరస్యానికి ఇది ఒక చారిత్రక ప్రతీక. కానీ, కళకు మతం రంగు పులిమి ఈ సామరస్యానికి విఘాతం కలిగించడం నేటి విషాదం. ముఖ్యంగా, రాజస్థాన్, హర్యానాలలోని పలు ప్రాంతాలలో వీరు ప్రసిద్ధిగాంచారు. ఏకధాటిగా 12 గంటల పాటు కథలను విప్పి చెప్పగలిగే సామర్థ్యం వీరి సొంతం. అయితే, ఆ సంగీత కచేరీలు ఇప్పుడు మసకబారుతున్నాయి. ''ముస్లిం జోగీల సంస్కృతి, చరిత్ర అసాధారణమైనది. కొన్ని శక్తులు దానిని అర్థం చేసుకోలేవు'' అని న్యూఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకి దూరంగా ఉన్న గ్రామమైన పినాన్కు చెందిన అనుభవజ్ఞుడైన జోగి జుమ్మెఖాన్ విలపించాడు.
మారుతున్న పరిస్థితులకుతోడు మతతత్వ ప్రభావం ముస్లిం జోగీలను మరింత ప్రమాదపు అంచుల్లోకి నెట్టివేసింది. ఇటీవల ఫిబ్రవరిలో గోరక్షకుల చేతుల్లో హత్యకు గురైన ఇద్దరు ముస్లిం యువకులను గుర్తుచేసుకుంటూ '' కైసో ఆయో జమానో బైమాన్'' అనే పాట రాయడం ద్వారా జుమ్మెఖాన్ చాలా కలవరపడ్డాడు. కొన్నేండ్లుగా జరుగుతున్న ఘటనలు తమ సంప్రదాయాన్ని, సమాజంలో తమ స్థానాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయానకంగా ఉన్నదని చెప్పారు. చారిత్రాత్మకంగా రాజస్థాన్, హర్యాలోని ప్రాంతమైన మేవాట్‌లో మియోస్, నాథ్ జోగిలు మతతత్వానికి బలి పెద్ద కమ్యూనిటీలు. ఇవి 1920లలో తబ్లిఘి జమాత్, హిందూ రైట్ వింగ్ రెండింటి దష్టిని ఆకర్షించాయి. వీరిలో ప్రతి ఒక్కరు కమ్యూనిటీని దానిలోకి లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ సఫలం కాలేకపోయారు. మియోస్లో ప్రదర్శకుల నాలుగు వంశాలున్నాయి - జోగిలు, మిరాసీలు (సంగీతకారులు మరియు నత్యకారులు), భండ్లు మరియు నాట్లు. చివరి ఇద్దరు వారి నటనా నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందారు.
కుటుంబ వేడుకలను ఉత్సాహపరచడానికి జోగిలు కీలకంగా ఉంటారు. వారి పాటలను వినడానికి చుట్టుపక్కల ప్రాంతాలవారు కూడా వస్తుంటారు. కానీ అదంతా ఇప్పుడు గతం. నేడు సమాజంలో వారి స్థానం, వారి కళ రెండింటికీ ముప్పు ఏర్పడింది. హిందూ, ముస్లిం అనే మత విభజన ఒకనాటి కళావైభవానికి పాతరేస్తోంది. ఈ ప్రాంతంలోని చాలా మంది జోగిలు తమ సంగీతంతో యూరప్‌కు వెళ్లారు. కానీ, పేదరికంతోనే తిరిగొచ్చారు. నేడు తమ కళతోపాటు జీవితాలనే కోల్పోతున్నారు. ఇలాంటి కళారూపాలు అంతరించిపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ కళాకారులకు జీవనోపాధి చూపాలని వేడుకుంటున్నారు.
కళకు కులం, మతం ఉండదు....
రాజస్థాన్‌లోని అల్వార్, హర్యానాలోని నుV్‌ా మధ్య మేవాట్‌కు ఇరువైపులా జోగి కుటుంబాలతో జరిపిన ఇంటర్వ్యూల ద్వారా వీరి అరుదైన సంగీత జ్ఞాపకాలు వేగంగా మసకబారుతున్నాయని తెలిసింది. హర్యానా మేవాట్ ప్రాంతంలో హిందూ జోగిలు కూడా ఉంటారు. అయితే, వీరి మధ్య కొన్ని విద్రోహక శక్తులు విభజన తీసుకురావడంతో ఈ ప్రమాదం ఏర్పడుతున్నదని అక్కడి జోగిలు ఆందోళన వ్యక్తం చేశారు. కళకు మతం రంగు పులమడం సరికాదనీ, కళాకారుడికి మతం, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు.