Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి
- నియామక ప్రక్రియలో లోపించిన పారదర్శకత
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రభుత్వ పాఠశాల్లో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. లోక్సభకు విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలకు సంబంధించిన శాఖ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని స్పష్టం చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని సకాలంలో అమలు చేసేందుకు, ఎన్ఈపీలో 30 :1 విద్యార్థి, ఉపాధ్యా య నిష్పత్తిని సాధించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ ''సమయ పరిమితి పద్ధతిలో'' భర్తీ చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ (ఎంఓఈ)ని పార్లమెంటరీ ప్యానెల్ కోరింది. విద్యా మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశంలోని ఎలిమెంటరీ, ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 2022 డిసెంబర్ 31 వరకు అన్ని రాష్ట్రాల్లో 62,71,380 పోస్టులు మంజూరయ్యా యని, వాటిలో 9,86,565 (15.7 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వ పాఠశాల్లో ప్రాథమిక స్థాయిలో 7,47,565, సెకండరీ స్థాయిలో 1,46,334, హయ్యర్ సెకండరీ స్థాయిలో 92,666 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిటీ తెలిపింది. కాబట్టి, 30:1 విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని సాధించడానికి సమయానుకూలంగా బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్స హించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ప్యానెల్ ధ్వజమెత్తింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత లేదని, ''గజిబిజిగా'' ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ విద్యా కమిటీలు సిఫార్సు చేసిన విధంగా రాష్ట్ర స్థాయిలో స్వయం ప్రతిపత్త ఉపాధ్యాయ నియామక బోర్డును ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంపై ఇంకా సంతకం చేయని ఎనిమిది రాష్ట్రాలు (బీహార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్) సమస్యను పరిష్కరించాలని సూచించింది.