Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోరు గ్యాంగ్ నుంచి తనకు ఈ బెదింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. పంజాబ్ గాయ కుడు సిద్ధూ మూసేవాలా మాదిరిగానే తననూ చంపేస్తామని వారు హెచ్చ రించారని రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.''లారెన్స్ బిష్ణోరు గ్యాంగ్ పేరుతో కొందరు నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఢిల్లీకి వస్తే ఏకే-47 తుపాకీతో కాల్చి చంపేస్తామని వారు హెచ్చరించారు. మూసేవాలాకు పట్టిన గతే నాకూ పడుతుందన్నారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా'' అని రౌత్ మీడియాకు తెలిపారు.
అయితే ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించట్లేదని ఆయన ఆరోపించారు. ''గతంలోనూ నాకు ఇలాగే బెదిరింపులు వచ్చాయి. కానీ రాష్ట్ర హోంమంత్రి ఇది కేవలం స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'' అని రౌత్ వాపోయారు. కాగా.. రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామని తెలిపారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. ఇటీవల మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.