Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్: శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా వడోదరలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటయింది. క్రైమ్ విభాగం డీసీపీ సారథ్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్ ఈ సిట్‌లో ఉంటుంది. గుజరాత్‌లోని వడోదర సిటీ కుంభద్వార-హాథిఖానా ప్రాంతంలో మార్చి 30న శోభాయాత్ర సందర్భంగా రాళ్లు రువ్వుడు ఘటన చోటుచేసుకుని తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.
అల్లర్లను ప్రేరేపించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ప్రమేయమున్నట్టు అనుమాని స్తున్న 23 మందిని వడోదర పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురిని వడోదరలోని స్థానిక కోర్టు పోలీసు రిమాండ్‌కు పంపగా, 19 మందిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.