Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూల్స్, కోడ్లు, మాన్యువల్స్‌లో రైల్వే ఏకపక్ష మార్పులను నివారించాలి : రైల్వే బోర్డును కోరిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాల గురించి రైల్వే బోర్డు చర్యలు తీసుకున్న (యాక్షన్ టేకన్) నివేదికలను త్వరగా సమర్పించాలనీ, అందుకోసం నిర్ణీత కాలపరిమితిని నిర్దేశించాలని పార్ల మెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. రూల్స్, కోడ్లు, మాన్యువల్స్ లో రైల్వే ఏకపక్ష మార్పులను నివారిం చాలని కమిటీ పేర్కొంది. లోక్‌సభలో రవాణా, పర్యాటకం, సాంస్కృతి పార్ల మెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్టులో రైల్వే భద్రతా కమిషన్ అంశంపై రైల్వే బోర్డు యాక్షన్ టేకెన్ రిపోర్టులను (ఏటీఆర్‌లు) సమర్పించ డానికి నిర్ణీత కాలపరిమితి ఉండాలని పేర్కొంది.
అలాగే, ప్రమాదానికి గల కారణాలను పరిశోధించే ప్రక్రియను, అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, దాని ఫలితంగా ఆస్తి, మానవ ప్రాణాలకు నష్టం జరగకుం డా సమర్థవంతమైన చర్యలు తీసుకో వాలని సూచించింది. రాజ్యసభ సభ్యు డు వి.విజయసాయిరెడ్డి నేతృత్వం లోని కమిటీ పార్లమెంట్లో సమర్పిం చిన నివేదికలో 2013-14లో జరి గిన ప్రమాదాల్లో రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి 15 ఏటీఆర్‌లు ఇప్పటికీ రైల్వే బోర్డులో పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏటీఆర్‌ల ను సమర్పించడంలో విపరీత మైన జాప్యం ప్రమాద పరిశోధనల మొత్తం ప్రయ త్నాన్ని అడ్డుకుంటుందని కమిటీ అభిప్రాయ పడింది. అందు వల్ల రైల్వే బోర్డు ఎటిఆర్లను సమర్పి ంచే విధానాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. ఇండియన్ రైల్వే చట్టం, మాన్యువల్స్ మొదలైన వాటిలో మార్పులు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే భద్రతా కమిషన్‌తో సంప్రదింపులు జరపాలని, రైల్వే భద్రతా కమిషన్ స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలని కమిటీ సూచించింది. అందువల్ల రైల్వే మంత్రి త్వ శాఖ చెల్లుబాటయ్యే సూచనను పరిశీలించవచ్చని, దానిని అమలు చేయడానికి మంత్రిత్వ శాఖతో సమ న్వయంతో ఒక యంత్రాంగాన్ని అను సరించవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. రైల్వే సేఫ్టీ కమిషన్‌ను సంప్ర దించకుండా రైల్వే భద్రతపై ప్రభావం చూపే రూల్స్, కోడ్లు, మాన్యువల్స్‌లో ఏకపక్ష మార్పులను రైల్వేలు నివారిం చాలని కమిటీ పేర్కొంది.