Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం చివరి నెల గడిచిన మార్చిలో దేశంలో వాహన కంపెనీల అమ్మకాల్లో మిశ్రమ ఫలితాలు చోటు చేసుకున్నాయి. 2022 మార్చితో పోల్చితే గడిచిన నెలలో మారుతి సుజుకి, కియా అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకోగా.. టివిఎస్ మోటార్, టాటా మోటార్స్ విక్రయాల్లో పెరుగుదల నమోదయ్యింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి మార్చి అమ్మకాల్లో 3 శాతం తగ్గి 1,70,071 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. టివిఎస్ అమ్మకాలు మూడు శాతం పెరిగి రూ.3,17,152 యూనిట్లుగా నమోదయ్యాయి. కియా ఇండియా విక్రయాలు 5 శాతం తగ్గి రూ.21,051 యూనిట్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు 3 శాతం పెరిగి 89,351 యూనిట్లకు చేరాయి. హ్యూందారు మోటార్ అమ్మకాలు 11 శాతం పెరిగి 61,500 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి.