Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా పట్ల అప్రమత్తం కండి
- పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
- ఆరు నెలల తర్వాత ఇదే అత్యధికం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3095 కేసులు నమోదయ్యాయి. ఆరునెలల తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు రోజురోజుకీ పెరుగు తుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. టెస్ట్‌లు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిం చింది. ప్రజలు మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరం నిబంధనను కచ్చితం గా పాటించాలని కేంద్రం సూచించింది. ప్రధా నంగా ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర , ఢిల్లీ, కేరళలో ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్స్‌బీబీ వేరియంట్, దాని సబ్ వేరియంట్ కేసులు మాత్రమే నమోదువుతున్నట్టు, కొత్త వేరియంట్ పుట్టుకురాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వల్పం గానే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 17 కేసులు నమో దు కాగా, ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 155 కు చేరాయి. ఏపీలో 6 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 71కి చేరింది.