Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తంగా ఉండాల్సిందే
- హెచ్చరించిన ఐఎండీ
న్యూఢిల్లీ: దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, బంగాల్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మహాపాత్ర వెల్లడించారు. ఇటీవలె కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉన్నా...మధ్యాహ్నా సమయాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శనివారం తెలిపింది. పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని చెప్పింది, బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా బంగాల్, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యంజరు మహాపాత్ర వెల్లడించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షణ, వాయువ్య దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా అనేక చోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈశాన్య వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఏప్రిల్లో సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాయువ్య మధ్య భారతదేశ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.